Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణా రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ కలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయం ఆవరణంలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అక్షరాలా రూ.50వేల కోట్లకు చేరడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జడ్పీటీసీలు పైడి వెంకటేశ్వర్లు, కళావతి, ఎంపీపీలు భదావత్ శాంతి, సోనా, చీమల నాగరత్నమ్మ, వివిధ మండలాల సర్పంచులు, ఉప-సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమితి సభ్యులు, వార్డ్ మెంబర్లు, జిల్లా తెరాసా నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.