Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాచలం సబ్ జైల్లో వనమా రాఘవ
అ భారీ పోలీస్ బందోబస్తు మధ్య సబ్ జైలుకు తరలింపు
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించిన పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన వనమా రాఘవను శనివారం భద్రాచలంలోని సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కొత్తగూడెం కోర్టులో పోలీసులు వనమా రాఘవ ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్కు ఆదేశించారు. ఈ మేరకు భారీ పోలీసు బందోబస్తు నడుమ భద్రాచలం సబ్ జైలుకు వనమా రాఘవను తరలించారు. భద్రాచలం సబ్ జైల్లో వనమా రాఘవకు 985 నెంబర్ను కేటాయించారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ మేరకు భద్రాచలం సబ్ జైల్లో వనమా రాఘవ 14 రోజులు రిమాండ్లో ఉండనున్నారు.