Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఖాళీ గ్రౌండులో మీటింగు చెప్పిన
ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ-దమ్మపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పొందిన లబ్దిదారులతో సంబరాలు నిర్వహించే విధంగా ప్రతి మండల కేంద్రంలో రైతులతో సంబరాలు నిర్వహిచాలని టీఆర్యస్ పార్టీ శ్రేణులకు ఆదేశించినప్పటికీ ఆ సంబరాలు దమ్మపేట మండలంలో అపహాస్యం పాలవడమే కాకుండా ఖాళీ గ్రౌండుకు మీటింగ్ చెప్పడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతే కాకుండా టీఆర్యస్ పార్టీ దమ్మపేట మండల నాయకుల మధ్య సమన్వయం లోపించడం వలన ప్రోటోకాల్ పాటించలేదని పలవురు నాయకులు గెజిటెడ్ హోదా కలిగిన వ్యవసాయాధికారి చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు నువ్వు అని సంబోధించడం అక్కడ ఉన్న అధికారులకు రుచించలేదు. దమ్మపేట మండల కేంద్రంలో శనివారం నాడు రైతు బంధు లబ్ది దారులతో సంబురాలు నిర్వహించాలని దమ్మపేట మండలంలో రైతు వేదిక ఉన్నప్పటికీ దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీ నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అశ్వారావుపేట శాసన సభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వేదికపై ప్రజా ప్రతినిథులు మాత్రమే ఉన్నారు. వేదిక ముందు రైతులెవరూ లేకపోవడం కనీసం టీఆర్యస్ పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తలు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం ముగ్గుల పోటీలో పాల్గొన్న విద్యార్థి నులు ఒక పక్కకు కూర్చున్నప్పటికీ రైతులు, ప్రజలు ఎవరూ హాజరు కానప్పటకీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తన ప్రసంగంతో ఓక దంపుడు ఉపన్యాసం నిర్వహించారు. తొలతు ఈ కార్యక్రమానికి హాజరయిన పాత్రికేయులకు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయమని కార్యక్రమ నిర్వాహకులకు ఒక ముఖ్య నాయకుడు సూచన చేయగా పాత్రికేయులతో మనకు పని ఏమిటి వారిని ఎక్కువ గౌరవించడం మంచిది కాదు అని ఆ నాయకుడు చెప్పటంతో సూచన చేసిన నాయకుడు మైకులో పాత్రికేయులందరూ కూర్చోవలసిందిగా కుర్చీలు ఏర్పాటు చేసి తెలిపారు. ఇదిలా ఉండగా దమ్మపేటకు చెందిన ఇరువురు ఎంపీటీసీలు ఉండగా కేవలం రెండవ ఎంపీటీసీ వైస్ ఎంపీపీని దారా మల్లిఖార్జున రావును మాత్రమే వేదిక మీదకు ఆహ్వానించడంతో ఆత్మకమిటీ చైర్మన్ కేదాసి వెంటసత్యనారాయణ గౌడ్ (కెవి) తన భార్య రాధ ఎంపీటీసీ అని అధికారులు టీఆర్యస్ పార్టీకి ద్రోహం చేసే కొంతమంది నాయకులు మాటలు విని ప్రోటోకాల్ పాటించకుండా దమ్మపేట ఒకటవ ఎంపీటీసీ అయిన తన భార్య రాధను వేదిక పైకి ఆహ్వానించకపోవడం కారణం ఏమిటని నిలదీసి దమ్మపేట ఏఓ చంద్రశేఖరరెడ్డిని ఏకవచనంతో సంబోదించడంతో కొంత వాగ్వివాదం నెలకొంది. ఏది ఏమైనప్పటకీ రైతులు లేకుడా సంబురాలు నిర్వహించడం, ప్రజలెవరూ లేనప్పటికీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రసంగించడం టిఆర్యస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు ప్రోటోకాల్ రూపంలో బయట పడటం పెద్ద చర్చగా మారింది.