Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ జాతీయ వైద్య బృందం శనివారం మండలంలో పర్యటించారు. నర్సాపురం పిహెచ్సి పరిధిలోని కె.దుమ్ముగూడెం గ్రామంలో కోవిడ్-19 సంక్రమణ వ్యాప్తిపై జాతీయ వైద్య బృందం గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కరోనా వైరస్ వ్యాధికి కారణమయ్యే ఎస్ఏఆర్ఎస్ కోవిడ్ 02, కోవిడ్ 19 అనేది కొత్త ఇన్ఫెక్షన్ అన్నారు. కోవిడ్-19 ఎంతవరకు ఉందో రూపొందించడం, కోవిడ్-19 ప్రతిరోధకాల అభివృద్ధి వ్యాది సంక్రమణ సూచిస్తుందన్నారు. ఈ సర్వే వివిధ వయసు గల స్త్రీ, పురుషులలో కాలక్రమేణా కొత్త కేసులు సంభవించే రేటును గుర్తించడానికి సర్వే నిర్వహిస్తున్నట్టు వైద్య బృందం సభ్యులు తెలిపారు. సమాజంలో సంక్రమణ వ్యాప్తి నివారించడానికి నియంత్రణ కోసం, మార్గదర్శకాలను రూపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అడిషనల్ డిఎంహెచ్ఓ వీరబాబు వైద్యులు బాలాజీ నాయక్, చైతన్యలతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ములకలపల్లి ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) బృందం ప్రజలకు సూచించింది. శనివారం మంగపేట పీహెచ్సీ పరిధిలోని పూసుగూడెంలో వారు పర్యటించి ఐసీఎంఆర్, ఎన్ఎన్ ఆధ్వర్యంలో సెరో శాంపిల్ సేకరణ సర్వే నిర్వహించారు. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో యాంటీ బాడీస్ వృద్ధి ఎలా ఉందో తెలుసుకునేందుకు 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. చిన్నపిల్లల ఎత్తు, బరువు కొలతలు సేకరించారు. ఐసీఎంఆర్ బృంద సభ్యులు డాక్టర్ హుస్సేన్, డాక్టర్ శశిభూషన్ కుమార్, బాలు ప్రసాద్, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.