Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చర్చనీయాంశంగా నవతెలంగాణ కథనం
అ మరిన్ని విషయాలు వెలుగులోకి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో టీఎస్ ఎన్పీడీసీఎల్ ఈఆర్ఓ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి వ్యవహరిస్తున్న తీరుపై నవతెలంగాణలో నేనింతే.. అనే కథనం ప్రచురితమైంది. దీంతో శనివారం భద్రాచలం పట్టణంలో పాటు జిల్లాలో నేనింతే...అంతా నా ఇష్టం.. అనే వెలువడిన కథనం చర్చనీయాంశంగా మారింది. బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్ కార్మికులు, పీఏఏ సూపర్వైజర్లతో పాటు విద్యుత్ వినియోగదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ అధికారి తీరుపై స్థానిక అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెలువడుతున్నాయి. గత ఏప్రిల్ నెలలో భద్రాచలం అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన ఈ అధికారి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. కార్యాలయానికి వచ్చి కాంట్రాక్టు కార్మికులతో పాటు వినియోగదారులను అనేక ఇబ్బందులకు గురి చేయడం, అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని, తన మాట వినకపోతే అనేక ఇబ్బందులు తప్పవని పలుమార్లు ఈ అధికారి ఆదేశాలు సైతం జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. వారానికి మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి కిందిస్థాయి కాంట్రాక్టు కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేయటం ఈ అధికారి ప్రత్యేక శైలిగా పేరుంది. ఈ మేరకు నవతెలంగాణలో శనివారం నేనింతే.. అంతా నా ఇష్టం.. అనే వార్తాకథనం ప్రచురితం కావడంతో ఈ అధికారి వ్యవహరించిన తీరుపై పలువురు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరులోనూ ఇదే తీరు?
గతంలో మణుగూరులో పనిచేసిన ఈ అధికారి వ్యవహరించిన తీరు సైతం వివాదాలకు దారి తీసిందనే తెలుస్తోంది. ఇక్కడ సైతం ఇన్చార్జి బాధ్యతలను నిర్వహించిన ఈ అధికారి పెట్టిన మానసిక ఇబ్బందులకు ఓ కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కొన్ని యూనియన్ల నాయకులు ఈ అధికారి తీరుపై జిల్లా అధికారులకు తెలియ పరచడంతో అక్కడినుంచి అధికారిని తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే క్రమంలో భద్రాచలంకు సైతం ఇన్చార్జి అధికారిగా వచ్చి అదే తరహాలో వ్యవహరించటం... నేనింతే నంటూ.. తన మాటే వినాలంటే.. వ్యవహరించటం పట్ల అధికార వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇదిలా ఉండగా భద్రాచలం డివిజన్ కేంద్రంలో ఉన్న ఈ కార్యాలయంలో ఎందరో అధికారులు పని చేసినప్పటికీ ఈ తరహాలో ఏ అధికారి వివాదాస్పదంగా వ్యవహరించిన తీరు లేదు. అదే విధంగా ఈఆర్వో కార్యాలయంలో మణుగూరు నుంచి బదిలీపై వచ్చిన మహిళా ఆర్టిజన్ను అనేక ఇబ్బందులకు గురి చేయటంతో, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సంబంధిత డీఈకి లిఖితపూర్వకంగా రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో డీఈ వద్ద ఈ అధికారి తీరుపై పంచాయతీ నిర్వహించిన అధికారులు ఈ అధికారికి అక్షంతలు వేసినట్లు ప్రచారం. మరోమారు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే చర్యలు తప్పవని అధికారులు మందలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ అధికారి వ్యవహరించిన తీరు ఎలా ఉందంటే తన వాహనంపై కూడా 'నేనింతే'... స్టిక్కర్ వేసి ఉండటం గమనార్హం.