Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాచలం సబ్‌జైలుకు తరలింపు
అ దారిపొడుగునా నిరసన నినాదాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజక వర్గం, పాల్వంచలో రామకృష్ణ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. మృతుడి సూసైడ్‌నోట్, సెల్పీ ఆధారంగా ఈ సంఘటనకు రాకకుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని దమ్మపేట, చింతలపూడిలో పోలీసులు ఎట్టకేలకు రాఘవను అరెస్టు చేశారు. శనివారం జిల్లా రెండవ అదనపు ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తి ఎం.నీలిమ ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి అతన్ని 14 రోజుల రిమాండ్‌కు భద్రాచలం రిమండ్ చేశారు. గత 6 రోజులుగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం రేపిన పాల్వంచ నాగ రామ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మరికొన్ని కేసులపై శుక్రవారం అర్థరాత్రి వనమా రాఘవేంద్రరావును పోలీసులు విచారించారు. కొన్ని కేసుల్లో తన ప్రమేయ ఉన్నట్లు ఒప్పుకున్నాడని పోలీసులు మీడియాకు తెలిపారు.
నిరసన జ్వాలలు....
తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని దమ్మపేల వద్ద పోలీసులు అరెస్టుచేసిన రాఘవేంద్రరావును శుక్రవారం ఆర్ధరాత్రి 1 గంటకు పాల్వంచ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాత్రి విచారించారు. శనివారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏఎస్పీ రోహిత్‌రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం మెజిస్ట్రేట్ వద్దకు తరలించే క్రమంలో కొత్తగూడెం-పాల్వంచ మధ్యలో రోడ్డు పొడుగునా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. కొంత మంది నిరసన కారులు ముందస్తుగా పోలీసులు అడ్డుకున్నారు.
కీచకుడు వనమా రాఘవ ఉరిశిక్ష వేయాలి
మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి
కీచకుడు, కామాందుడు వనమా రాఘవకు సత్వర శిక్ష అమలు చేయాలని, సభ్య సమాజంలో అతనికి జీవించే హక్కు లేదని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి అన్నారు. శనివారం కోర్టుకు హాజరుపరుస్తుండటంతో కొత్తగూడెం ప్రధాన రహదారి రామాటాకీస్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాన్ని అడ్డుకుని రోడ్డుపై బైటాయించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రామాటాకీస్ రోడ్డులో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాళ్ళు వీసంశెట్టి పద్మజ, మామిడాల ధనలక్ష్మి, దార లక్ష్మి, కె.రత్నకుమారి, లింగంపల్లి సుగుణ, మిట్టపల్లి సునీత, నాగమణి, మద్దెల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ జైలుకు తరలించాలి : ఆవాజ్ డిమాండ్
ఎమ్మెల్యే వనమా కొడుకుని భద్రాచలం సబ్ జైలు కాదు, వరంగల్ సెంటర్ జైల్‌కి తరలించాలని ఆవాజ్ జిల్లా సహా య కార్యదర్శి జలాల్ మొహమ్మద్ డిమాండ్ చేశారు. పోలీ సులకు దొరికి శనివారం కోర్టు ముందు హాజరుపర్చిగా భద్రా చలం సబ్ జైలుకు తరలించారు. అతన్ని సబ్ జైలు కాదు, వ రంగల్ సెంటర్ జైల్‌కి పంపించాలని, ఆయన కేసు లు విచా రణ జరిగేదాకా బెయిల్ ఇవ్వకూడదని ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి జలాల్ మహమ్మద్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
రాఘవని ఎన్ కౌంటర్ చేయాలి : బీజేపీ
కొత్తగూడెంలో కోర్ట్‌కి వెళ్తున్న రాఘవని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి రోడ్డుమీద నిలబడి జిజేపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ నినాదాలు చేశారు. కోర్ట్‌కి తీసుకువెళ్లి పోలీసుల, న్యాయవ్యవస్థ సమయం వృధా చేయొద్దని, సామాన్య ప్రజలకు ఒక న్యాయం, తెరాస వాళ్ళకి ఒక న్యాయమా అన్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు.