Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మణుగూరు బంద్ విజయవంతం
అ కరోనా నిబంధనలకు
విరుద్దంగా అరెస్ట్‌లు
నవతెలంగాణ-మణుగూరు
భదాద్రి కొత్తగూడెం జిల్లా కాలకేయుడు వనమా రాఘవను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయ విచారణ త్వరితగతిన పూర్తి చేసి శిక్షించాలని, మణుగూరు మండలంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైంది. శనివారం సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌లో నాయకులు కార్యకర్తలు బంద్‌కు సహాకరించారని ర్యాలీగా వెళ్ళుచుండగా ప్రధాన రహదారిపై నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు కరోనా నిబంధనలకు విరుద్దంగా ర్యాలీలు నిర్వహించరాదని ఎస్సై పురుషోత్తం, జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు జెండాలు లేకుండా బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. దుకాణా సముదాయాలు, జిరాక్స్ సెంటర్లు, సినిమహాళ్ళు, ఆయిల్ బంకులు పూర్తిగా బంద్‌ను పాటించాయి. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కో కన్వీనర్ గురిజాల.గోపి, సీపీఐ(ఎం) నాయకులు మునిగల శివప్రశాంత్, ఎన్డీ నాయకులు మధుసూదన్‌రెడ్డి, నర్సయ్య, సాగర్, వరలక్ష్మీ, జేవి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ, బ్లాక్ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఉన్నారు. అనంతరం ఇఫ్టూ, నవీన్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ బంద్ నిర్వహాణలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొడిశాల రాములు, కార్యిదర్శి వర్గ సభ్యులు ఉప్పుతల నరసింహారావు, సీపీఐ మండల పట్టణ కార్యదర్శులు సర్వర్‌పాష, సుధాకర్, నర్సింహారావు, కాంగ్రెస్ పార్టీ నాయుకులు రాజు, నవీన్,ఎన్డీ నాయకులు గౌస్, షబానా తదితరులు పాల్గొన్నారు.