Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండల కేంద్రంలో 14వ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం బూర్గంపాడుకు చెందిన బబ్బు లెవన్ జట్టుకు మండల టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని టీ షర్ట్సును జట్టు క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోనెల నానితో పాటు తోకల సతీష్ పాల్గొని టీ షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోనెల నాని మాట్లాడుతూ ముందుగా యువత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకో వాలని ఆయన అన్నారు. క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని, పట్టుదలతో ఆడి ఫైనల్స్‌కు చేరుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, బబ్బురాయుడు, కార్తిక్, వెంకీ, సింగు, హరీష్, నాగరాజు, కోటి, పవన్, ప్రసాద్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.