Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ప్రవాస భారతీయుల దినోత్సవ సందర్భంగా భద్రాచలం సరోజ వికలాంగుల అనాధవృద్ధుల ఆశ్రమ నందు బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో దుర్గా స్వీట్స్ అధినేత సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై బెక్కంటి నిఖిత పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం ఆశ్రమంలోని వృద్ధులందరికీ పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెక్కంటి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్లు వేంపాటి ఉషారాణి, పోతుల రమేష్ బాబు, జి.సాయి జీ, వేంపాటి సీతారావమ్మ, వేంపాటి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.