Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బోడ మంగీలాల్
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అందరి బంధువని ఎంపీపీ బోడా మంగీలాల్ తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో కందాళ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించబడ్డాయన్నారు. పాలేరు నియోజకవర్గంలో అందరి బంధువుగా ఎమ్మెల్యే కందాళ ఉన్నారని అలాంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో ఉండడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంబేద్కర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
తిరుమలాయపాలె మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషాబోయిన వీరన్న ఆధ్వర్యంలో మండలంలో కేక్ కట్‌చేశారు.
కూసుమంచి : పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందాళ ఉపేందర్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఆయన కుమార్తెలు దీపిక-దీప్తి, అల్లుడు డాక్టర్ సురేందర్‌రెడ్డి కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తలసేమియా వ్యాధి గ్రస్తులకు 200 మంది ఎమ్మెల్యే అభిమానులు రక్తదానం చేశారు.