Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 1535 యూనియన్ క్యాలెండర్,
డైరీ ఆవిష్కరణలో
అ జెన్కో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
అ హైదరాబాద్‌లో యూనియన్
కార్యాలయానికి శంఖుస్థాపన
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్‌రంగంలో ఉద్యోగ కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలంగాణ జెన్కో ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ఫ్రభాకర్రావు అన్నారు. ఆదివారం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535, 2022 నూతన సంవత్సర పవర్డైరీ విష్కరించారు. అనంతరం ఎర్రగడ్డ ఈఆర్ని దగ్గర యూనియన్ కార్యాలయానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లనే అభివృద్ధి సాధిస్తామని ఆ దిశగా కార్మిక సంఘ నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్పిడిసిఎల్ సిఎండిలు రఘమారెడ్డి గోపాలరావు, టిఎస్పిఈఎ 1535 సెంట్రల్ కమిటీ అద్యక్షులు ఎంఏ వజీర్, సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి డి.రాధాకృష్ణ, టీఎస్జెన్కో అద్యక్ష, కార్యదర్శిలు పి.రాము, జి.కుమారస్వామి, 1535 అనుబంధ సంస్థ హెచ్ 48 నాయకులు జి.సతీష్, కేటిపిఎస్ రీజియన్ అధ్యక్ష, కార్యదర్శిలు దానయ్య, వెంకటేశ్వర్లు, మణుగూరు బీటీపీిఎస్ అధ్యక్షులు వెలదండి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.