Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మృతుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేత ఎమ్మెల్యే
నవతెలంగాణ-ములకలపల్లి
ప్రతి కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అండగా ఉంటుందని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని ములకలపల్లికి చెందిన సాంబశివరావు, పూసుగూడెం పంచాయతీ ఒడ్డు రామవరంకు చెందిన తాటి చిరంజీవి, మరో కుటుంబానికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షల బీమా చెక్కులను ఎమ్మెల్యే మెచ్చా అందజేశారు. తొలుత ములకలపల్లిలో రైతుబందు సంబరాల్లో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ములకలపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సాంబశివుడు కుటుంబంతో పాటు పూనుగూడెం పంచాయతీ ఒడ్డు రామవరం గ్రామానికి చెందిన తాటి చిరంజీవి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ తరఫున మంజూరైన రూ.4 లక్షల చెక్కులను వారి కుటుంబాలకు అందజేశారు. పాలాభిషేకం అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబందు అమలవుతుందన్నారు. ఎంపీపీ మట్ల నాగమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అప్పారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగళ్ల వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంత, ఎంపీటీసీ మెహరామణి, చందర్ రావు, వెంకటేశ్పరు, మండల కార్యదర్శి శెనగపాటి సీతారాపురం సర్పంచ్ సున్నం సుశీల, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.