Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంట్రాక్టు కార్మికుల సంఘం
(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బి.మధు
నవతెలంగాణ-కొత్తగూడెం
కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్షత విడనాడాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియూ) రాష్ట్ర ప్రధన కార్యదర్శి బి.మధు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం హైద్రాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో మధు మాట్లాడారు. సింగరేణి యామాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్షత విడనాడాలని, వేతానాలు పెంచాలని, జేఏసీ పెట్టిన డిమాండ్స్ పరిష్కారానికై తెలంగాణా ప్రభుత్వం, యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాలు ద్వారా సింగరేణి యాజమాన్యం పై తీవ్రంగా వత్తిడి తీసుక రావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు వేల్పుల కుమారస్వామి, కె.రాజయ్య, గద్దల శ్రీనివాస్, ఎం.చంద్రశేఖర్, యన్.సూర్య, శ్రీనివాస్, కుమారి, మదనమ్మ, లక్ష్మి, సిహెచ్.ఉపేందర్, సదానందం, అంజి తదితరులు పాల్గొన్నారు.