Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు రమేష్
నవతెలంగాణ-ఇల్లందు
త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని రైతుల పోరాట స్పూర్తితో రాష్ట్రల ఓటర్లు తగిన గుణపటాని నేర్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఏజే.రమేష్ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) కార్యాలయం ఏలూరి భవన్లో ఆదివారం పార్టీ మండల కమిటీ, శాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎన్నికలు వచ్చిన సమయంలో సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని ఓటర్లను మభ్యపెడుతున్నారని అన్నారు. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల ఓటర్లు గమనించాలని అన్నారు. బీజేపీ కేంద్రంలో ఉండి రైతులను, కార్మికుల వ్యతిరేఖ చట్టాన్ని తీసుకువచ్చి సంవత్సర కాలం రైతులను ఇబ్బందులకు గురి చేసారని ఈ ఉద్యమాన్ని ఓటర్లు ఈ ఎన్నికల సందర్భంగా మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. మతోన్మాదని రెచ్చ గొట్టి చేస్తున్న పాలనను గమనించాలని అన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో యోగి చేసిన నీచమైన పాలనను ఈ సారి లేకుండా చేయాలని అన్నారు. కరోన సమయంలో చనిపోయిన వారిని గంగ నదిలో పడేసిన ఘటనలను మననం చెసుకొని ఓటర్లు తీర్పు ఇవ్వాలని రాజ్యంగాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ 5 రాష్ట్రాల ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి అబ్దుల్ నబి, దేవులపల్లి యాకయ్య, ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్, మన్నెం మోహన్ రావు, జబున్నిసా, అబ్బాస్, మరియ, సంధ్య, వెంకటేశ్వర్లు, వెంకటమ్మా, సుల్తానా, లక్ష్మీ, పద్మ, ఖాదర్, రాము, రాందాస్, అభిమన్యు పాల్గొన్నారు.