Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం
నవతెలంగాణ-గుండాల
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండలంలోని మామకన్ను, ముత్తాపురం, పోతిరెడ్డిగూడెం, జగ్గాయిగుడెం, లక్ష్మీపురం, చీమలగూడెం, లింగగూడెం, దేవళ్ళగూడెం, రోళ్ళగడ్డ, రోళ్ళగడ్డ తండా, నరసాపురం గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు పాయం దృష్టికి తీసుకుకుపోగా వెంటనే సంబంధిత డీఈతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అర్హత గల వారికి వృద్ధాప్య ఫించన్లు, పోడు భూములకు పట్టాలు, కిన్నెరసాని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గువ్వంకల చెరువుకు నీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రయినేజీలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు ప్రమాధ బాధితులు, తదితర సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే ఖదీర్, చాట్ల పద్మ, దూలయ్య, రోళ్ళగడ్డ సర్పంచ్ అజ్మిరా మోహన్, ముత్తాపురం సర్పంచ్ పూనెం సమ్మయ్య, శంకర్, పాయం సత్యనారాయణ, కె బుచ్చయ్య, పి.బుచ్చయ్య, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.