Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
ఎంకిపెల్లి సుబ్బి సావుకు వచ్చినట్లుగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ పరిణామాలు. ప్రస్తుత స్థానిక శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు కుమారుడి నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు అధికారపార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో నియోజకవర్గానికి బలం చేకూరింది. ఈ నెల 3న షాడో ఎమ్మెల్యే చలామని అవుతున్న వనమా తనయుడు వనమా రాఘవ బెదిరింపులు, లైంగిక వేధింపుల కారణంగా పాల్వంచలోని పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాత్పడ్డ విషయం విధితమే. ఈ ఘటనలో మృతుడి రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో మరణ వాగ్మూలం టీఆర్ఎస్ పార్టీపాతాలానికి నెట్టింది. ఈ చావుదెబ్బ నుండి కోలుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నానా తంటాలు పడుతుండగా విపక్షాలు అయిన కాంగ్రెస్, బీజేపీలతో పాటు రాజకీయ పార్టీలు పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. దీంతో కొత్తగూడెం నియోజకవర్గం రాజకీయ సమీకరణ పూర్తిగా మారుతున్నాయి. గతంలో వనమా వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం భూస్థాపితం అయినట్లే. అదిష్టానం కూడా వీరిపై మండిపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆ కుటుంబానికి సీటు వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఇదే అదనుగా అధికార పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహిళా రాష్ట్ర నాయకులు జలగం హేమమాలిని దస్తీ వేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ అధిష్టానం కూడా త్వరలోనే సంక్రాంతి పండు గ తర్వాత ఇన్చార్జీని నియమించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. నియోజ కవర్గంలో చావు దెబ్బతిన్న టీఆర్ఎస్ను బతికించుకు నేందుకు అధిష్టానం ప్రయత్నాలు ముమ్మురం చేస్తుంది. ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదులు పెడుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా నియో జకవర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వాలని పలువురు టీఆర్ఎస్ అధిష్టాన్ని కోరినట్లు తెలుస్తుంది. అధిష్టానం కూడా నియోజకవర్గానికి ఇన్చార్జీని నియమించేందుకు లోపాయకరంగా ఏ అభ్యర్థిని కరారు చేసి బాధ్యతలు అప్పగిస్తుందని వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్న నియోజ కవర్గంలో తిరిగి ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, నియోజకవర్గంపై దృష్టి సారించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటనలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలో పర్యటించి ఆసుపత్రిలో ఉన్న బాధితురానికి పరామర్శించి సంఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దోశులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏకంగా భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య వనమా రాఘవను కల్చి వేయాలంటూ బహిరంగంగా డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికంటే ముందు మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ఘటనపై తీవ్రంగా ప్రతిఘటించారు. వనమా రాఘవ అక్రమాలపై బయటపెడుతూ అరెస్ట్ చేసే వరకు పోరాటం నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కేంద్రంలో రాఘవను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించి అరెస్ట్ అయ్యారు. ఇది కేంద్రంతో అధికారంలో ఉన్న బిజేపి సైతం కొత్తగూడెం నియోజకవర్గంలో బలం పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటనలో తీవ్రస్థాయిలో జిల్లా పార్టీ అద్యక్షులు కోనేరు సత్యనారాయణ నిరసన కార్యక్రమలు నిర్వహించారు. నియోజకవర్గం బంద్ రాఘను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. రాఘవను కోర్టును తీసుకువెళ్తున్న వాహనాన్ని సైతం అడ్డుగా నిలబడి వ్యతిరేక నినాదాలు చేశారు. ఇలా అన్ని పార్టీలు నియోజకవర్గంలో బలం పెంచుకుని పాతపాల్వంచ సంఘటనను సద్వినియోగం చేసుకుంటు న్నారు. ఏదిఏమైనా తండ్రి అసమర్ధత తనయుడి కీచక పర్వం ఈసారి రాజకీయ జీవితానికి కారుచీకట్లు కమ్మేలా చేశాయి. టిఆర్ఎస్ అధిష్టానం ఎవరికి పట్టం కడుతుందో అని ఆ పార్టీ నాయకులలో ఉత్కంఠ నెలకొంది.