Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు,
నవతెలంగాణ రఘునాధపాలెం
రైతాంగం సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. ఆదివారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో జరిగిన రైతుబంధు సంబురాలలో మంత్రి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలభిషేకం చేసారు. ఈ సందర్భంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో 50 వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందించిందని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాకు ఈ సీజన్ కు సంబంధించి 316 కోట్లు రైతుబంధును విడుదల చేసిందని, ఇప్పటి వరకు 276 కోట్లు రైతుల ఖాతాలకు జమ అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆగని పథకం రైతుబంధు ఒక్కటే అని మంత్రి అన్నారు. యాసంగిలో ఎఫ్.సి.ఐ రాష్ట్రం నుండి ధాన్యం కొనుగోలు చేయదని స్పష్టం చేసినందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఇట్టి విషయాన్ని గమనించి రైతులు యాసంగిలో వరి వేసి నష్టపోకుండా వ్యవసాయ అధికారులు సూచనల మేరకు డిమాండ్ కలిగిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మంత్రి కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులను ఆర్థిక పరంగా ఆదుకునేందుకు రైతు బంధు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకులు నాగభూషణం, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆర్జెసి కృష్ణ, రఘునాథపాలెం జడ్పీ.టి.సి మాలోతు ప్రియాంక, ఎం.పి.పి. భూక్యా గౌరీ, గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ గుత్తా వెంకయ్య, వైస్ ఎంపిపి రవి, రైతుబంధు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ సుధాకర్, ఖమ్మం వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, వైస్ చైర్మన్ కొంటె ముక్కుల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అజ్మీర వీరు నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్, లక్ష్మణ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా సహాకార శాఖాధికారి విజయకుమారి, వ్యవసాయ శాఖ ఏ.డి శ్రీనివాసరావు, తహశీల్దారు నర్సింహారావు, ఎం.పి.డి.ఓ, రామకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.