Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో ప్రజలకు అన్ని వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ పేర్కొన్నారు.
ఆదివారం ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లలో ఆధునిక టెక్నాలజీతో ఆరు రోడ్లకు మొత్తం రూ.91 లక్షలతో నిర్మించిన వాక్సిమ్ డెవ్టార్డ్ ఫ్లోరింగ్ (వద్ఫ్ ) రోడ్స్ ను నగర మేయర్ పునుకొల్లు నీరజ కలిసి మంత్రి పువ్వాడ తో ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ మొత్తం అవసరమైన చోట ప్రతి రోడ్డు ను సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించమని పేర్కొన్నారు. 20వ డివిజన్ మమత రోడ్ నందు రూ. 12.50 లక్షలు, 21వ డివిజన్ 5-ఎలిమెంట్స్ వద్ద రూ.18.30లక్షలు, శ్రీచైతన్య పాఠశాల రోడ్ రూ.17.50లక్షలు, రూ. 4.00 లక్షలు, 50వ డివిజన్ లో రూ. 16.20లక్షలు, రమణగుట్ట లో రూ.22.50లక్షలతో నిర్మించిన సి.సి రోడ్డును ప్రారంభించారు. ఈ.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఏఎంసి మార్కెట్ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, టిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఇంచార్జ్ ఆర్జెసి కృష్ణ, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, మేడా ప్రశాంతి లక్ష్మి,, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, రాపర్తి శరత్, టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి షకీనా, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.