Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'స్వాతంత్య్ర భారతదేశంలో సంక్షేమ పాలన అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త చరిత్రకు నాంది పలికారు...పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనతికాలంలోనే దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకున్నాం..మహాత్ముడు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారు..ముఖ్యంగా గ్రామాలు, రైతుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే...'అని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం రైతుబంధు సంబరాల్లో భాగంగా కొణిజర్ల, ముదిగొండ మండలాల్లో పర్యటించిన ఎంపీ నామ కొణిజర్ల మండలం లాలాపురం, ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను, రైతులను, బడుగుబలహీన వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కొణిజర్ల మండలంలో అన్ని గ్రామాలు ఇప్పుడు ఒకే తాటిపై కేసీఆర్ బాటలో టీఆర్ఎస్ పార్టీ లైన్లో ఉండటం హర్షించ దగిన విషయమన్నారు. రహదారుల అభివృద్ధికి గాను గ్రామస్తులు రూ.8లక్షల నిధులు కావాలని అడిగారనీ, ఎంపీ ల్యాడ్ నిధులనుండి రూ.10లక్షలు మంజూరు చేస్తానని ఎంపీ నామ గ్రామస్తుల హర్ష ద్వానాల నడుమ ప్రకటించారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మరియు ఎమ్మెల్సీ మధు తో కలిసి ఆదివారం కొణిజర్ల మండలంలోని లాలపురం గ్రామం లో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు రైతుబంధు సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ జైపాల్ గొల్లపాడు సీతారాములు, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతరములు, స్థానిక కౌన్సిలర్లు రామారావు, వేణు, కొణిజర్ల జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీపీ మధు, వైస్ ఎంపీపీ రమణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై.చిరంజీవి జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు మాధవరావు పీఏసీఎస్ చైర్మన్ చెరుకుమల్లి రవి, వైరా మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, వైరా టౌన్ ప్రెసిడెంట్ దారన్న రాజశేఖర్, కట్ట కష్ణార్జున రావు, విశ్వేశ్వర్ రావు, మండల ఎస్టీ సెల్ కార్యదర్శి భూక్యా నరసింహ నాయక్, కో ఆప్షన్ నెంబర్ మౌలానా, సర్పంచ్ లు మోహనరావు, లక్ష్మి, మాన్సింగ్, నాగమణి, నాగేంద్ర కాంతమ్మ, నీలా, పాల్గొన్నారు..