Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉపాధ్యాయ బదిలీలతో పెరిగిన ఖాళీ పోస్టుల సంఖ్య
నవతెలంగాణ-బోనకల్
ఖాళీ పోస్టులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ఎలా సాగుతుందని మండల ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మండల వ్యాప్తంగా 10 ఉన్నత పాఠశాలలు 32 ప్రాథమిక పాఠశాలలు ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు ముద్దు అంటూ ఒకవైపు ప్రభుత్వం ప్రచారం చేస్తూ మరొకవైపు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా బదిలీల పేరుతో మరిన్ని పోస్టులను ఖాళీ చేసింది. మండల విద్యా వ్యవస్థకు పర్యవేక్షణ (ఎంఈఓ) అధికారి లేకుండా గత అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. మండలంలో 10 ఉన్నత పాఠశాలలో 112 మంజూరి పోస్టులు ఉన్నాయి. ఇందులో 86 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 33 ప్రాథమిక పాఠశాలలో 90 మంజూరి పోస్టులు ఉన్నాయి. ఇందులో 73 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని ఖాళీ పోస్టులతో మండలంలో విద్యా బోధన ఎలా సాగుతుందని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోతరగతికి ప్రధాన పోస్టులే ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో పదవ తరగతిలో మంచి ఫలితాలు ఎలా వస్తాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిరునోముల ఉన్నత పాఠశాలలో బయాలజీ పోస్టు ఖాళీగా ఉంది. బోనకల్ ఉన్నత పాఠశాలలో బయాలజీ, సాంఘిక శాస్త్రం సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గోవిందాపురం ఎల్ ఉన్నత పాఠశాలలో హిందీ, బయాలజీ, సాంఘిక శాస్త్రం, తెలుగు, పీజీ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పాఠశాలలో మొత్తం అత్యధికంగా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జానకిపురం ఉన్నత పాఠశాలలో పిజిహెచ్ఎం, గణితం, బయాలజీ, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పాఠశాలలో కూడా అత్యధికంగా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మోటమర్రి ఉన్నత పాఠశాలలో పిజిహెచ్ఎం, తెలుగు, హిందీ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఆళ్లపాడు ఉన్నత పాఠశాలలో పిజిహెచ్ఎం, తెలుగు, సోషల్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో పిజిహెచ్ఎం, బయాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలకోట ఉన్నత పాఠశాలలో పిజిహెచ్ఎం, తెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10 ఉన్నత పాఠశాలలో పిజిహెచ్ఎం పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 4, బయాలజీ 5, సోషల్ 5, హిందీ 2, ఇంగ్లీష్ 2, గణితం 1, ఫిజిక్స్ 1, సబ్జెక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 32 ప్రాథమిక పాఠశాలలో 6 ఎఫ్ఎల్హెచ్ఎమ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10 ఎస్జిటి పోస్ట్లు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ 1 ఖాళీగా ఉన్నాయి. ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, పెద్ద బీరవల్లి, మోటమర్రి, బోనకల్, ఆళ్లపాడు ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోనకల్ ఎస్సీ కాలనీ, జానకిపురం, నారాయణపురం, పెద్ద బీరవల్లి కాలనీ, కలకోట హరిజన కాలని, కలకోట, రాయన్నపేట, గోవిందాపురం హరిజన కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మండలంలో ఖాళీగా ఉన్న 43 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యార్థుల తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు.