Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నాణ్యమైన విద్య- ఉపాధి కల్పన సొంతం
అవిద్యాసంస్థలకు 15 ఏళ్లు -ఏడాదికి 8 క్యాంపస్ ప్లేస్ మెంట్లు
అ డేర్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దరిపల్లి అనంతరాములు విద్యా సంస్థలు ప్రారంభించి 40 ఏళ్ళు అయ్యిందని, నాటి నుండి నేటి వరకు ఉత్తమ విద్యా బోధన తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడ ంలో అగ్రస్థానంలో ఉన్నట్లు దరిపల్లి అనంత రాములు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల యాజమాన్యం అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. కిరణ్ పేర్కొన్నారు. కాలేజీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం, ఇల్లందు, భువనగిరి, అనంతారంలో మొత్తం 24 బ్రాంచీలతో ఇంటర్ నుండి పీజీ, డిప్లొమా, వృత్తి విద్య, ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తమ కాలేజీలో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. కళాశాలలో ఎంబీఏ చదివిన బి.కృష్ణ చైతన్య రూ.23 లక్షలు, బీటెక్ పూర్తి చేసిన బి.నాగలక్ష్మి రూ.12 లక్షల వార్షికాదాయం పొందుతున్నారని తెలిపారు. ఎంబీఏ పూర్వ విద్యార్థిని పర్హా 2021 స్త్రీ శక్తి అవార్డుకు ఎంపికకావడం తమ కాలేజీకి గర్వకారణమన్నారు. అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్లేస్ మెంట్స్ నిర్వహిస్తుండటంతో ఎందరో అత్యుత్తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందించడం తమ కాలేజీ సొంతమన్నారు. విశాల ప్రాంగణం, అధునాతన ల్యాబ్ లు, డిజిటల్ లైబ్రరీ, విదేశీ ఉచిత ఉన్నత విద్యకు ఫారెన్ యూనివర్సిటీలతో ఒప్పందం ప్రత్యేకతగా చెప్పారు. జాతీయస్థాయి క్రీడల్లోనూ తమ విద్యార్థులు పతకాలు సాధించారన్నారు. ఈ సమావేశంలో కాలేజీ కోఆర్డినేటర్ కేవీ నారాయణన్, బీటెక్, డిప్లొమా కో ఆర్డినేటర్లు లింగయ్య, స్వప్న ప్రియ, ఏవో సోమయ్య పాల్గొన్నారు.