Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
అటలు ఆరోగ్యానికి మంచిదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాససభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అక్కినపల్లి సంపత్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటనును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువతరం ఆధునిక జీవన విధానాల్లో ఒత్తిడి కారణంగా క్రీడలకు దూరమవుతున్నారన్నారు. దీనికారణంగా చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, ఊబకాయం లాంటి వ్యాధులతో బాాధపడుతున్నారన్నారు. ప్రతి యువతి, యువకులు వ్యాయామం, క్రీడల్లో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అక్కినపల్లి సంపత్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొమరం జంపేశ్వరి, కోటేశ్వరరావు, జావిద్పాషా, అధికసంఖ్యలో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.