Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు బంధు సంబరాలలో
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-వైరా
వ్యవసాయం లాభసాటిగా మార్చి రైతును రాజును చేసి సాగు వైపు మళ్ళించే ఒకే ఒక్కడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలనాలుగో తారీకు నుండి జరుగుతున్న రైతుబంధు సంబరాల్లో భాగంగా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి రైతు సంబరాల ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు. కొనిజర్ల, వైరా రూరల్, వైరా మున్సిపాలిటీ పరిధిలోని రైతులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీని సుమారు ఐదు కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య అధ్యక్షతన జరిగిన రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ దేశానికి దిక్సూచి రైతు బంధు పథకం అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ వ్యవసాయ అధికారులైన ఏడిఏ బాబురావు, కొణిజర్ల, వైరా అధికారులు పవన్, బాలాజీలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, ఏడిఏ బాబురావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు దార్న రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, జడ్పిటిసి పోట్ల కవిత పాల్గొన్నారు.