Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
మిర్చి సాగు రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం) నాయకులు తెలంగాణ రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, భాస్కర్ రావు, అయినాల రామలింగేశ్వరరావు సోమవారం జిల్లా పర్యటనలో బాగంగా తల్లాడకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వాతావరణం మిర్చి పంటకు అనుకూలంగా లేకపోవడంతో చీడపీడలతో రైతులు పెట్టిన పెట్టుబడులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారిని ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య, డి శ్రీనివాసరావు, షేక్ లాల్ మియా, తదితరులు మంత్రికి మిర్చి రైతులను ఆదుకోవాలని వినతిపత్రాన్ని సమర్పించారు.