Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చోరీకి పాల్పడ్డ వ్యక్తులు
అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు
అ విలేకరులు సమావేశంలో
ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన లక్ష్మీనరం స్టేట్ బ్యాంకులో జరిగిన చోరీను దుమ్ముగూడెం పోలీసులు చేదించారు. దీనికి సంబందించి సోమవారం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరులు సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు గత నెల 14వ తేదీ రాత్రి సమయంలో లకీëనగరంలో గల స్టేట్ బ్యాంకు వెనుక నుండి లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలు, అలారం సిస్టం వైర్లు కత్తిరించి స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించారు. డబ్బులు ఉన్న సేఫ్ లాకర్‌ను గ్యాస్ కట్టర్ సహాయంతో పగులగొట్టి అందులో ఉన్న రూ.19,35,650 నగదుతో పాటు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను దొంగిలించు కుపోయారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు లకీëనగరం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, భద్రాచలం నందు ఉన్న సీసీ కెమెరాల ఆదారంగా ఏపీ 28 ఏజెడ్ 6678 అనే నెంబరు గల మహీంద్రా స్కార్పియో వాహనం లకీëనగరం వచ్చినట్లు గుర్తించి అనుమానంతో అట్టి వాహనాన్ని పట్టుకోవడం కోసం నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల ముఠా సభ్యులతో అట్టి వాహనం చింతూరు నుండి భద్రాచలం వైపు వస్తుందనే సమాచారం మేరకు సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, సిసిఎస్ సిఐ పుల్లయ్య, ఎస్ఐ రవికుమార్‌లు సోమవారం సిబ్బందితో కలసి భద్రాచలంలోని కూనవరం రోడ్లో అట్టి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో ఏడుగురు వ్యక్తులతో పాటు రెండు గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్స్, గోడలను పగులగొట్టే బలమైన సామాగ్రి ఉండడంతో వారిని విచారించగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన నవాబుల్ హసన్, మహమద్ నవాబ్ హసన్, రాజు వసంతరావు వర్భే, సాదిక్ ఆలీఖాన్, మహమూద్ మహకూమ్, యూసఫ్ ఖాన్, ఇంతిఖాబ్ ఖాన్, అని తెలిపారు. వీరు గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో రెండు దొంగతనాలు, బాంద్రా జిల్లాలో ని ఐదు దొంగతనాలు, గొండియా జిల్లాలో రెండు దొంగతనాలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సైదాల్ జిల్లాలో రెండు దొంగతనాలు, చిన్వర జిల్లాలో ఒక దొంగతనాలకు పాల్పడడంతో పాటు ఇలా బ్యాకులలో, ఏటిఎమ్‌లలో పలు దుకాణాలలో చోరీకు పాల్పడినట్లు వారు విచారణలో వెల్లడించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం మార్చి నెలలో పెద్దపల్లి జిల్లా మంతెని మండలం గుంజపడుగు ఎస్బిఐ బ్యాంకులో చోరీకు పాల్పడగా అక్కడ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేయగా తిరిగి జైలు నుండి బయటకు వచ్చి 2021 డిసెంబరు 5 వ తేదీన అసిఫాబాద్ ఏరియాలోని ఆడ గ్రామంలో గల ఎస్బిఐ బ్యాంకులో చోరీ చేసి 8 లక్షల రూపాయలు దోచుకు వెళ్లారు. బ్యాంకుల ద్వారా దోచుకున్న డబ్బును ముఠా సభ్యుల్లో ఒకరైన లఎక్ ఉజ్జమా అనే వ్యక్తి ఇచ్చి ఉత్తరప్రదేశ్ పంపించినట్లు వారు విచారణలో తెలిపినట్లు ఆయన తెలిపారు. కాగా వారి వద్ద నుండి రూ.3 లక్షల 10 వేల, 9 సెల్ ఫోన్లు, ఏపి 28 ఎజెడ్ 6678 నెంబరుగల స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టర్స్, రెండు సిలెండర్లు, సామాగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఎనిమిది ముఠా సభ్యులు గల అంతరాష్ట్ర దొంగలు రూరల్ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. విలేఖరుల సమావేశంలో సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, సిసిఎస్ సిఐ పుల్లయ్య, ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐ సత్యనారాయణ, హెడ కానిస్టేబుల్ సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.