Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మండల అభివృద్ధికి వందకోట్ల నిధులు మంజూరు చేయాలి
అ ఎంపీపీ ముక్తి సత్యం
నవతెలంగాణ-గుండాల
పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న పోడు సాగు దారులందరికీ పట్టాలు ఇవ్వాలని, మండల అభివృద్ధికి రూ.వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎన్డీ జిల్లా నాయకులు, ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. ఈ విషయమై ఎన్డీ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ను కలిసి వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొడవటంచ గ్రామంలో ఏడు మెలికల వాగు చేక్ డ్యాంపై ఇసుక మేటలు తొలగించాలని, గుండాల నుండి మటంలంక గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి రాళ్లవాగు, ఇసుక వాగు లపై బ్రిడ్జీలు నిర్మించడంతో పాటు సాయనపల్లి నుండి రంగాపురం రోడ్డుకు ఫారెస్ట్ క్లియరెన్సు ఇప్పించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు పాల్గొన్నారు.