Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డైలివేజ్, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించండి
అ ఆన్ లైన్ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కి సీఐటీయూ వినతి
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన, ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలివేజ్, అవుట్ సోర్సింగ్ కార్మికులను, వారికుటుంబాలను సంక్రాంతి పండుగపూట పస్తులుంచకుండా వేతనాలు చెల్లిటచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి కోరారు. సోమవారం ఆన్లైన్లో కలెక్టరేట్లో నిర్వహించి ప్రజా వాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో వేతనాల సమస్యపై ఫిర్యాదు చేశారు. పనిచేయించుకుని వేతనాలు ఇవ్వకుండా పస్తులంచటం అన్యామని ఆయన అన్నారు. ఐటీడీఏకి చైర్మెన్‌గా వున్న కలెక్టర్, ఐటీడీఏ పీఓలు చర్చించుకుని ఐటీడీఏ నుండి అయిన జీతాలు ఇవ్వాలని కోరారు. సమస్యను కలెక్టర్, పీఓకి వివరించి వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని ఆన్ లైన్లో జాయింట్ కలెక్టర్ హామి ఇచ్చారు.