Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుతల నరసింహారావు అన్నారు. ఆయన సోమవారం పినపాక మండలం జానంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన తాపీ వర్కర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాపీ వర్కర్ల అందరికీ పని కల్పించాలని, ప్రతి కుటుంబానికి గ్రూపు ఇన్సూరెన్స్, మెడికల్ అలవెన్సులు కల్పించాలని డిమాండ్ చేశారు. పని దొరకని రోజుల్లో భృతి కల్పించాలని, హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. బిల్డింగ్ కార్మికులకు అసంఘటిత కార్మిక రంగంలో వచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పినపాక మండలంలో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ను సీఐటీయూ అనుబంధంగా పినపాక మండలంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా మురళీ, కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా తుపాకుల కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా ఈర్ల రమణయ్య, ఉపాధ్యక్షులుగా దాట్ల సత్యనారాయణ, రామటెమకి కిరణ్, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణరావు, సహాయ కార్యదర్శి గుమాసు కృష్ణ, కమిటీ సభ్యులుగా వెంకటేశ్వర్లు, కేశవరావుతో పాటు పది మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షులు మురళి మాట్లాడుతూ కరోనా సమయంలో పనులు లేక ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడ్డామని మళ్లీ లాక్ డౌన్ విధిస్తే బాధలు తప్పవని కావున ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, వర్కర్లు, పాల్గొన్నారు.