Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా ఉన్నతాధికారులకు పగిడేరు రైతుల విన్నపం
నవతెలంగాణ-మణుగూరు
ధాన్యం కోనుగోలు చేసి మా ప్రాణాలను కాపాడాలని పగిడేరు రైతులు కలెక్టర్ అనుదీప్, ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. సోమవారం పగిడేరు పంచాయతీ పరిధిలోని 6 గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం కోనుగోలులో ఐకేపీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ధాన్యం కోనుగోలు కేంద్రాలలో సరైన సమయంలో బస్తాలు, లారీలు అందుబాటులో లేక సుమారు 80 లారీల ధాన్యం మిగిలి ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ నెల 20 తేదీని ఆఖరి తేదీగా ప్రకటించారు. కానీ ధాన్యం తరుగుదల పేరుతో 10 నుంచి 15 కేజీలు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు, కుంజా గోపాల్, గోబోజి భద్రయ్య ఆత్మహత్యకు ప్రయత్నించగా రైతులు కలెక్టరుకు తమ గోడు వెల్లబుచ్చుకునేందుకు కొత్తగూడెం వచ్చినట్టు తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా కలవలేకపోయామని, కలెక్టర్ ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడారు. అనంతరం డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ కార్యాలయంలో డీఎంఎఫ్ అధికారి నాగజ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీనీవాసరెడ్డి, అన్నవరపు. కనకయ్య, పగిడేరు ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారి, మాజీ ఎంపీటీసీ వీరయ్య, మాజీ సర్పంచ్ తాటి భిక్షం, ఎల్క.రాÄఘవులు, వెంకటయ్య, శ్రీరాములు, ఎం.వేణు, డి.సురేష్, తదితరులు అధికారులు కలిసిన వారిలో ఉన్నారు.