Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బంగారు పతకాలు సాధించిన డాక్టర్ ఎం.హిమబిందును సోమవారం ఘనంగా సన్మానించారు. పాల్వంచలోని స్థానిక షైనీ నందు సోమవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్ మాట్లాడుతూ.. డాక్టర్ హిమబిందు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని కర్నూల్ మెడికల్ కళాశాలలో 2016 సంవత్సరంలో ఎమ్ఎస్ ఆప్తమాలజీ కోర్సు పూర్తి చేసి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్‌గా నిలిచారన్నారు. ఇందుకుగాను 2 బంగారు పతకాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు వెండి పతకాన్ని యూనివర్సిటీ ప్రకటించింది. ఈ పతకలన్నీ విజయవాడలో యూనివర్సిటీ 22వ వార్షికోత్సవంలో తేదీ 06-01-2022 నాడు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్యాంప్రసాద్, ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సి.పలని వేలు చేతుల మీదగా అందుకోవడం గర్వకారణమన్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు పాల్వంచలోని షైన్ ఆప్టికల్స్, విజన్ ఐ కేర్ సెంటర్లో కన్సల్టెంట్ డాక్టర్‌గా ఉత్తమ నేత్ర వైద్య సేవలందిస్తు, అనేక మంది పేద ప్రజలకు సహాయం అందిస్తున్న డాక్టర్ ఎం.హిమబిందు ఈ పతకాలు సాధించడం మన జిల్లాకు గర్వకారణమని ఈ సందర్భంగా వారిని పలువురు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్, పాత్రికేయులు పంజాల వెంకట్ నారాయణ, మొహమ్మద్ అబ్దుల్ రజాక్, వీరన్న, స్టాలిన్, రాజ్ దీప్, తదితరులు పాల్గొన్నారు.