Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 40 కుటుంబాలకు దుస్తులు పంపిణీ
అ మరిన్ని గ్రామాలక చేయూతను అందిస్తాం :
నిర్వాహకురాలు శ్రీలక్ష్మి
నవతెలంగాణ-చర్ల
మండలంలోని మారుమూల ఆదివాసి గ్రామమైన క్రాంతిపురం గిరిజనులకు అండగా ఖమ్మంకు చెందిన సత్యమార్గం సర్వీసెస్ సొసైటీ ఉంటామంటూ సుమారు 40 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. మంగళవారం సుబ్బంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ గ్రామామైన క్రాంతి పురానికి సక్రమమైన రోడ్డుమార్గం లేకపోయినప్పటికీ ఐసీడీఎస్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ వరలక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ సత్యమార్గం సర్వీసెస్ సొసైటీ వారు నిరుపేద పిల్లలకు, గర్భవతులకు, పిల్లల తల్లులకు, వృద్ధులకు చక్కటి దుస్తులు, చెప్పులు, శాలువాలు, గార్మెంట్స్తో పాటు దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం ఆనందదాయకం అన్నారు. ప్రతి ఒక్క స్త్రీ ఒకరు లేక ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్క గర్భవతి చక్కటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతమైన చిన్నారులకు జన్మనివ్వాలని ఆమె సూచించారు. పౌష్టికాహారం లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ శుభ్రతతో రోజూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చూసించారు.