Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రాల్లోనే ఇల్లందు మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పట్టణాన్ని ముస్తాబు చేసి సుందరంగా తీర్చిదిద్దేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టియుఎఫ్డిఐసీ కింద రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. హైదరాబాదులోని ప్రగతి భవన్లో సోమవారం ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ హర్షింగ్ నాయకులు పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావును కలుసుకున్నారు. మున్సిపాల్టీలో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించి ఉత్తర్వులు అందజేశారు. టియుఎఫ్డిఐసీ నిధుల నుండి రూ.15 కోట్లు మంజూరు చేశారు. బుగ్గవాగు ప్రక్షాళనకు రూ.5 కోట్లు, ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు రూ.1 కోటి 50 లక్షలు, పట్టణ ప్రధాన కూడలీల సుందరీకరణకు రూ.1 కోటి 20 లక్షలు, ఆడిటోరియం నిర్మాణానికి రూ.2 కోట్ల యాభై లక్షలు మంజూరు చేశారు. ఇల్లందు ప్రధాన రహదారికి డిఎంఎఫ్టి నిధుల నుండి రూ.10 కోట్లు మంజూరు చేయాలని సింగరేణి సీఎండి శ్రీధర్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వారు కూడా జనవరి నెలాఖరు కల్లా నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు రోల్ మోడల్‌గా నిలిచే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హర్షింగ్లు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్రాంతి కానుక అన్నారు. మంత్రులను కలిసిన వారిలో మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్, పట్టణ టీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్ ఉన్నారు.