Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రేపు ఉత్తర ద్వార దర్శనం
అ వైదిక సిబ్బంది సమక్షంలోనే
ఉత్సవాల నిర్వహణ
అ కరోనా నేపథ్యంలో భక్తులకు
ప్రవేశం లేదు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి తెపోత్సవం ఈ కార్యక్రమాన్ని బుధవారం సా యంత్రం నిర్వహించనున్నారు. అలాగే గురువారం తెల్లవారు జామున ఉత్తర ద్వారంలో స్వామి వారు దర్శనమివ్వనున్నారు. కరోనా వ్యాప్తి ఉండటంతో ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అనుమతి లేదు. ఆలయంలోని నిత్యకల్యాణ మండప వేదిక వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో స్వామి వారి తెప్పోత్సవం కొద్దిమంది వైదిక సిబ్బంది సమక్షంలో మాత్రమే నిర్వహించాలని దేవాదాయశాఖ అధికారులు ఆదేశించారు. ఈక్ర మంలో అనుగుణంగానే దేవస్థా నం ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనంకు సైతం భక్తులను అనుమతించడం లేదని, ఇందుకు సంబంధించి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారి ఖాతాలో నగదును త్వరలోనే తిరిగి జమ చేస్తామని దేవస్థానం ఈవో బి.శివాజీ పేర్కొ న్నారు. ఇదిలా వుండగా గురువారం నుంచి భద్రా చలం రామాలయంలో రాపత్తు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు సేవలు ప్రారంభంకానున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం తిరుమంగై ఆళ్వారు పరమపదోత్సవం నిర్వహించ నున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సమయంలో పగల్పత్తు ఉత్సవాల ముగింపు రోజున తిరుమంగై ఆళ్వార్లకు పరమ పదోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్ర దాయం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా భక్తిప్రపత్తులతో నిర్వహించనున్నారు.
గత ఏడాది మాదిరిగానే...
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అత్యంత ప్రధానమైన ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఒకటి. అయితే ఈ ఉత్సవాలను కనులారా చూడాలని అనుకున్న భక్తులకు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో ఉత్సవాలను పూర్తిగా అంతరంగికంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది కూడా తెపోత్సవం, ఉత్తరద్వార దర్శనం ఉత్సవాలు కూడా రామాలయంలో అంతరంగికంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా కరోనా వ్యాప్తి నేపథ్యంలో రామాలయంలో అంతరంగికంగానే ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.