Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
నవతెలంగాణ-పాల్వంచ
గత 30 ఏండ్ల నుండి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని అనేక నేరాలు, అరాచకాలకు పాల్పడుతూ...పాత పాల్వంచలో నాగ రామక్రిష్ణ కుటుంబం ఆత్మ హత్య చేసుకునేలా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కీచకుడు, మదమెక్కిన కామంధుడు వనమా రాఘవను వెంటనే ఉరితీయాలని, లేదా ఎన్ కౌంటర్ చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాఘవ అరాచకాలను ఆపకుండా, కనీసం రాఘవ తప్పులను గురించి ఎటువంటి మాట మాట్లాడకుండా పదవిని, కోడుకు నేరాలకు గోడుగులా వాడుకునేలా వ్యవహరించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఎన్డీ పార్టీ జిల్లా, డివిజన్ నాయకులు ముద్దా బిక్షం, నిమ్మల రాంబాబు, యన్ సంజీవ్, వెంకన్న పాల్గొన్నారు.