Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మొదటినుంచి టీఆర్ఎస్ పార్టీ ఓటు రాజకీయాలకు పాల్పడేందుకు రౌడీషీటర్లను తమ ఆయుధాలుగా వాడుకోవడం వలనే పాల్వంచలోనే రామకృష్ణ కుటుంబం బలిదానానికి గురి అయ్యిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో అల్లె సుధాకర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 30 ఏండ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా రాఘవ చేస్తున్న అక్రమాలపై నిస్పక్షపా తంగా విచారించాలన్నారు. హత్య రాజకీయాలు బెదిరింపులు, భూ మాఫియా, లైంగిక వేధింపులపై సరైన విచారణ జరగకపోవడం దీనికి కారణమన్నారు. అధికార పార్టీ స్వంత అవసరాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయో గించు కుంటుందన్నారు. పోలీస్ ఆఫీసర్ల కోసం ఫైరోలు చేసి డబ్బులు తీసుకోని పోస్టింగ్ ఇచ్చి తమకు కావాల్సిన పనులను దర్జాగా నడిపించారన్నారు. వ్యవస్థలో ఇలాంటి వారి వలనే నేరగాళ్ళు తయారవుతారన్నారు. రాష్ట్రంలో కోవిడ్ రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి కరోనా బాధితులను ఆదుకోవాల న్నారు. మణుగూరు మున్సిపాలీటీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇష్టానుసారంగా ఇంటిపన్నులు పెంచుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా సామాన్యులు, పేదలు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నా రన్నారు. వెంటనే పెంచే పన్నులను విరమించుకోవాలని, లేకపోతే ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరిం చారు. మండల కార్యదర్శి కోడిశాల రాములు, కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల లెనిన్, నరసింహారావు, టివిఎంవి ప్రసాద్, నాగమణి, ఎం.శివప్రశాంత్, నాగలక్ష్మీ, పద్మ, లక్ష్మణ్‌రావు, కృష్ణ, తదితరులు పాలఒ్గన్నారు.