Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలోని సోలార్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు బుధవారం నుండి సమ్మెకు పూనుకున్నారని సమ్మెను విజయ వంతం చేయాలని ఇఫ్ట్యూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యన్.సంజీవ్, కొత్తగూడెం రీజీయన్ అధ్యక్షులు పి.సతీష్ కోరారు. మంగళవారం ఏరియా జిఎం ఆఫీసులో డివైపిఎం కిరణ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొత్తగూడెం సోలార్ సెక్యూరిటీ కార్మికులకు సింగరేణి యాజమాన్యం సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అనేక సార్లు సింగరేణి యాజమాన్యానికి, కాంట్రాక్టర్లకు లెటర్లు ఇచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దసరా, దీపావళి నుండి జీతాలు రాలేదని, వచ్చే సంక్రాంతికి కూడా జీతాలు రావని కార్మికులు ఆందోళన చెందుతున్నారని వెంటనే కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సోలార్ కార్మికులు అజరు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.