Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
నేడు జరిగే మిర్చిపంటపై రైతు శిక్షణ క్షేత్ర సందర్శనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం 12వ తేదీన మండలంలోని జానంపేట, భూపతిరావు పేట గ్రామాలలో జాతీయ సుగంధద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో మిర్చి పంటలో నాణ్యతా ప్రమాణాల పెంపుపై నిర్వహిస్తున్న రైతు శిక్షణ, మిర్చి పంట క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని స్ధానిక రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఈ రైతు శిక్షణా కార్యక్రమంలో మిర్చి పంటపై నాణ్యతా ప్రమాణాల పెంపుపై శిక్షణ ఇచ్చేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నారాయణమ్మ, స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లింగప్ప, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొంటున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు. సాగులో తమ సందేహాలను, సమస్యలను రైతులు నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు.