Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండల కేంద్రంలో రెండు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి మంగళవారం గిరిజనేతరులు ప్రవేశించారు. విషయం తెలుసు కున్న తహసీల్దార్ ఉష శారద గిరిజనేతరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రవేశిస్తే చట్టరీత్యా నేరం అవుతుందని, వెంటనే ఖాళీ చేయాలని కోరగా వారు అందుగా నిరాకరించారు. తాము నిరుపేదలమని మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లివ్వాలన్నారు. అక్కడికి వచ్చిన జడ్పీటీసీ కొనకళ్ల వెంకటరెడ్డికి విషయాన్ని గిరిజనేతరులు చెప్పగా వారికి మద్దతుగా మాట్లాడారు. ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకొని ముస్లిం మైనార్టీ, దళితులు, బీసీలకు ఇండ్లివ్వక పోవడం వలన అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి వారిని పోలీసుల సహకారంతో అక్కడ నుండి తహసీల్దార్ ఉష శారద, ఎస్ఐ బి.రాజేష్ కుమార్ పంపించేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు తాళాలు వేసితాత్కాలికంగా సమస్యలను అధికారులు పరిష్కరించారు.