Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా
జిల్లా అధికారి కస్తాల సత్యనారాయణ
నవతెలంగాణ-ఖమ్మం
సామాజిక మార్పుకు తమ సర్వస్వాన్ని దారపోసిన అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయుల ఆశయాల లక్ష్యంతో కృషి చేస్తున్న కేవీపీఎస్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ముద్రించడం అభినందనీయం అని, మహనీయుల ఆశయాల సాధనకు కృషి చేస్తున్న కెవిపిఎస్ను ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా జిల్లా అధికారి (ఎస్సీ డిడి) కస్తాల సత్యనారా యణ అభినందించారు. మంగళవారం డిఆర్డిఏలోని ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అంతరాలు కొనసాగుతున్నంత కాలం మహనీయుల ఆశయాలు నేటి తరానికి నేర్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అంతరాలను అంతం చేయడానికి మహనీయుల కృషి మరువలేనిదని వారు కొనియాడారు. క్యాలెండర్ శాస్త్రీయ అభ్యుదయ భావాలు పెంపొందించే విధంగా ఉందన్నారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ నేడు దేశంలో బీజేపీ విధానాలు దళితుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయని, దళితులపై పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని వారు విమర్శించారు. సామాజిక మార్పుకు సమానత్వ సమాజానికి బాటలు వేసేందుకై పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అప్జల్ హస్సన్, హెచ్ డబ్ల్యు ఓ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆర్.ప్రకాష్, యం. గోపాల్, పాపిట్ల సత్యనారాయణ, కుక్కల సైదులు, పి.నాగరాజు, బొట్ల సాగర్, నకరికంటి చిరంజీవి, మర్రి బాబురావు, మందుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.