Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్సీ బాలసాని
నవతెలంగాణ-భద్రాచలం
రైతు బంధు పథకంతో రైతులకు భరోనిచ్చిందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ అన్నారు. మంగళ వారం భద్రాచలం పట్టణంలో రైతు బంధు సంబురాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శాంతినగర్ కాలనీ నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఉన్న రైతు వేదిక వరకు ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రైతు వేదికలో జరిగిన సమావేశంలో బాలసాని, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావులు మాట్లాడారు. 2018లో ప్రారంభమైన రైతు బంధు పథకం ద్వారా 10వ తేదీ నాటికి 50వేల కోట్లు రైతులకు అందించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఎంత మందికి సొమ్ము అందుతుందదని ప్రశ్నించారు. అనంతరం ఏఓ అనీల్ మాట్లాడారు. అనంతరం వ్యాసరచన, డిబేట్, డ్రాయింగ్, పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ రైతులుగా ఎంపికైన అబ్బినేని శ్రీనివాసరావు, నర్రా గోపయ్యలను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేశారు. వెటర్నరీ పీడీ రవీంద్రనాథ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు తిప్పిన సిద్ధులు, మండల ఉపాధ్యక్షులు నర్రా రాము తదితరులు పాల్గొన్నారు.