Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో యువతకు రాజకీయశిక్షణా తరగతులు : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-ఇల్లందు
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని, రానున్న రోజుల్లో యువతకు ప్రత్యేకంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులోని ప్రగతి భవన్లో మంగళవారం ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మెన్ వెంకటేశ్వరరావు సహకారంతో ఇల్లందు యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తిక్ మంత్రి కేటీఆర్‌ను కలుసుకున్నారు. నిర్వహిస్తున్న కార్యక్రమాలను మంత్రికి వివరించగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం, హితబోధ చేశారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తిక్ మాట్లాడుతూ యువతను సమీకరించి పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.