Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్పర్సన్ కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
దాతలు అందిస్తున్న సహకారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల పరిధిలోని జానకిపురం ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజు బియ్యం, నోటు పుస్తకాలు, గిఫ్ట్ ప్యాకెట్స్, ఆటవస్తువులను మంగళవారం పంపిణీ చేశారు. హౌప్ చారిటబుల్ సొసైటీ సంస్థ వీటిని ఉచితంగా అందజేసిది. జానకిపురం 250 మందికి బియ్యం, గిఫ్ట్ పాకెట్, మరియు నోట్ పుస్తకాలతో పాటు ఆటబొమ్మలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా సంస్థ నిర్వహించాలని కోరారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని ప్రజలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. నిరుపేదలకు ఎప్పుడు సంస్థ అండగా నిలవాలని కోరారు.సంస్థ నిర్వాహకులు కృప ఎల్లయ్య లను కమల్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలం తహశీల్దార్ రావూరి రాధిక, మండల విద్యాశాఖ అధికారి ఎం ఇందిరా జ్యోతి, పెద్ద బీరవల్లి చిన్న వీరవల్లి సర్పంచులు ఆళ్ల పుల్లమ్మ, చిలక వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి వరుగు గోపి సంస్థ ప్రతి నిధులు వై. శ్రీవేణు ,హౌప్ ఇంచార్జ్ రమేష్ , పాస్టర్ బుంగ ఏర్నెస్ట్ పాల్ ఏఎస్ఐ దొండపాటి వెంకటనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు మాజీ జెడ్పిటిసి కొత్తకొండ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్ రావు మాజీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు టిఆర్ఎస్ మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.