Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తొమ్మిదోవ రోజైన మంగళవారం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారు శ్రీ కృష్ణా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి వారిని దర్శించి తరించారు. తొలుత శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి ఆలయంలో శ్రీ కృష్ణా అవతారంలో అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణ మండపానికి తీవ్ర కొచ్చారు. ఈ సమయంలో స్వామి వారికి విష్వస్చేన పూజా, పుణ్యహ వచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి వేద విన్నపాలను సమర్పించారు. అనంతర వేద పారాయణం పఠించారు. అనంతరం స్వామి వారికి నివేదన చేశారు. అనంతరం భక్తులు స్వామిని దర్శించు కున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈఓ శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ స్థానాచార్యులు, కె.వి.స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతా రామాను జాచార్యులు, అమరవాది విజయ రాఘవన్, పరిపాలన వైదిక సిబ్బంది పాల్గొన్నారు.