Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని స్థానిక ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాయిగూడెం గ్రామంలో గిరివికాసం బోరు వేసినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మండలానికి గిరి వికాసం పథకంలో రూ.24 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయగా, మండలంలో 11 బోర్లు మంజూరు చేయాలని నివేదికలు పంపగా, అందులో 5 బోర్లకు మొత్తం రూ.10 లక్షల చొప్పున అనంతోగు, రాయి గూడెం, చంద్రాపురం, సుద్దరేవు, నదిమిగుడెం గ్రామాలకు ఐదు బోర్లు మంజూరయ్యాయని తెలిపారు. నేడు ఐటీడీయే గిరి వికాసం పథకం ద్వారా మండలంలో రైతులకు పొలంలో బోరు, త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం ఉచితంగా కల్పించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో మంగమ్మ, డైరెక్టర్ సాంబశివ రావు, ఎన్ఆర్ఈజీఎస్ ఈ.సీ అప్పారావు, ఏ.పి.వో రఘునందన్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రైతులు, పాల్గొన్నారు.