Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బాధితులు ముందుకు వస్తే అండగా ఉంటాం
అ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
వనమా రాఘవేంద్రరావుపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పాల్వంచలో జరిగిన కుటుంబ సభ్యుల ఆత్మహత్యలో ముద్దాయిగా ఉన్న వనమా రాఘవపై 2006వ సంవత్సరం నుండి నేటి వరకు పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 కేసులు నమోదయ్యాయని చెబుతున్న పోలీసులు ఆయన ఎందుకు రౌడీ షీట్ ఓపన్ చేయడం లేదని ప్రశ్నించారు..? పాల్వంచలో జరిగిన ఘటనను బహుజన్ సమాజ్ పార్టీ ముందుగా వెలుగులోకి తెచ్చి పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జున్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కె.షేబనా, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గుడివాడ రాజేందర్, మహిళా కన్వీనర్ వీణ తదితరులు పాల్గొన్నారు.