Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్ సాధనకు కృషి
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపాలిటీ శానిటీ ఇన్స్ఫెక్టర్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి సోమవారం రిలీవ్ అయ్యారు. ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. ఈయన 2020 ఫిబ్రవరిలో ఇల్లందు మున్సిపాలిటీలో బాధ్యతలు చేపట్టారు. పట్టణ పరిశుభ్రతకు మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వ రరావుకు ఆదేశాల మేరకు వారితో కలిసి పాటుపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ర్యాంక్ సాధనకు విశేష కృషి సల్పారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలో పేరుకు పోయిన చెత్త కుప్పల తొలగింపు, కంపుకొడుతున్న బుగ్గవాగు, డ్రైనేజీల పరిశుభ్రతలో కృషి చేశారు. దక్షణ భారత దేశంలో స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో ఇల్లందు మున్సిపాలిటీ 19వ తెలంగాణలో 8వ ర్యాంక్ పొందడంలో తన వంతు కృషి సల్పారు. ఆగస్టు 15న హరితహారంలో ఉత్తమ శానిటరీ ఇన్స్ఫెక్టర్గా కలెక్టర్ నుండి ప్రశంసాపత్రం అందుకున్నారు. పట్టణ ప్రజలు, పాలకవర్గం, అధికారులు వీరి సేవలను అభినంది స్తున్నారు. దశాబ్దాల కాలంగా మున్సిపాలిటీకి పూర్తి స్ధాయి శానిటరీ ఇన్స్ఫెక్టర్ లేరు. ప్రస్తుతం శానిటరీ ఇన్స్ఫెక్టర్ రవీందర్ రెడ్డి బదిలి కావడంతో కథ మళ్ళీ మొదటికొచ్చినట్టయింది.
ఆర్ఓగా అంకుష్షావలి పదవీ బాధత్యలు స్వీకరణ
మున్సిపాలిటీకి మరో నలుగురు సిబ్బంది
ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీకి మొత్తం ఐదుగురు కొత్త సిబ్బంది సోమవారం బాధ్యతలు చేపట్టారు. కోదాడ మున్సిపాలిటీ నుండి ఆర్ఓ అంకుష్షావలి పదవీ బాధ్యతలు చేపట్టగా, ఖమ్మం కార్పొరేషన్ నుండి జూనియర్ అసిస్టెంట్ దాసరి వీరభద్రం, అటెండర్ లింగాల వీరభద్రం, పబ్లిక్ హెల్త్ వర్కర్లు సోమమ్మ, రాంపాదంలు విధుల్లో చేరారు.