Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
తల్లాడ మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో వరకట్నం, కులం పేరుతో వేధింపులతో మృతి చెందిన వివాహిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానకి భర్త బంధువులు ముందుకు రాకపోవడంతో భర్త ఇంటి ముందే ఖననం చేసేందుకు యత్నించారు. వైరా సీఐ వసంత కుమార్ వారితో మాట్లాడి, ఈ విషయంతో సంబంధం ఉన్న వారి పేర్లు కేసులు నమోదు చేయడంతో మౌనిక బంధువులు అంగీకరించి తెల్లవారుజామున 4 గంటలకు అంత్యక్రియలు స్మశాన వాటికలో నిర్వహించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన బండి మౌనిక(20) అదే గ్రామానికి చెందిన రేగళ్ళ నరేంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. గత ఐదు నెలలుగా వీరిరువురు ఖమ్మంలో కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. గత కొంత కాలంగా వరకట్నం కోసం, కులం పేరుతో వేధిస్తున్నారని, ఈ నెల 3న మౌనిక పై హత్యాయత్నం చేసి అపస్మారక స్థితిలో ఉండగా, ఆత్మహత్యకు పాల్పడినట్టు నమ్మించే ప్రయత్నం చేశారని,