Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అ షుగర్ కెన్ పాలసీని రూపొందించాలి
అ అఖిల భారత షుగర్ కెన్ ఫార్మర్స్
ఫెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ-వైరా టౌన్
చెరకు టన్నుకు ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించాలని, రాష్ట్ర ప్రభుత్వం షుగర్ కెన్ పాలసీ రూపొందిచాలని, అఖిల భారత షుగర్ కెన్ ఫార్మర్స్ ఫెడరేషన్ సభ డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షుగర్ కెన్ ఫార్మర్స్ ఫెడరేషన్ జాతీయ సమావేశాలు సంఘం జాతీయ అధ్యక్షులు రవీంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చెరకు రైతుల సంఘం జాతీయ కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చెరకు ధర పెంచకపోగా రికవరీ 8.5 నుంచి 9.5కు తర్వాత 10 శాతంకు పెంచి రైతుల ఆదాయంను షుగర్ కంపెనీలు లూటీ చేయడానికి అవకాశం చట్టబద్ధంగా ఇచ్చిందని అన్నారు. ఈ క్రషింగ్ సీజన్ కు క్వింటాళ్లకు ఐదు రూపాయలు మాత్రమే ధర పెంచి కేంద్ర ప్రభుత్వం రైతులను అవమానించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం 1,50,000 ఎకరాల నుంచి 50,000 ఎకరాలకు తగ్గి పోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం లేదని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలను వ్యవసాయ విధానంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం రైతులను గందరగోళం పరుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానంతోపాటు చెరకు విధానం కూడా రూపొందించాలని అన్నారు. చెరకు సాగుకు ఎరువులు, పురుగు మందులు, పెట్రోల్, డీజిల్ ధరలు భారిగా పెరిగి గిట్టుబాటు కావడం లేదని కట్టింగ్, రవాణా చార్జీలు భారం రైతులు భరించలేని స్థాయికి చేరుకుందని, సాగు విస్తీర్ణం తక్కువ అయిందని, మరోవైపు వరి పంట సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించటంతో మాగాణి భూములలో ఏ పంట సాగు చేయాలో అర్థం కానీ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం రైతులు ఉన్నారని అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం కోసం రైతు ఉద్యమాల మార్గం అన్నారు. ఈ సభలో అఖిల భారత కార్యదర్శి ఎస్.శుక్లా, అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్, జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాదినేని రమేష్, బాల్ రెడ్డి, గోపి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.