Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ది దేవా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాచలం పట్టణానికి 50 కిమీ దూరంలో మారుమూల గ్రామాల ప్రజలకు ఆర్టీసి బస్సు సర్వీసులు నడిపి ప్రజలకు ఆర్టీసి సేవలను చేరువ చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ది దేవా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పెద్దనల్లబల్లి గ్రామం నుండి చత్తీష్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పైడిగూడెం వరకు నిత్యం సుమారు. 20 గ్రామాల ప్రజలతో పాటు, చత్తీష్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వందలాది గిరిజన గ్రామాల ప్రజలు నిత్యం ఏదో ఒక పని మీద భద్రాచలంతో పాటు మండల కేంద్రమైన లకీëనగరం రాక పోకలు సాగిస్తుంటారన్నారు. దీంతో పాటు నిత్యం, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సౖెెతం ఇబ్బందులు పడుతున్నారని ఈవిషయాన్ని గతంలో ఇక్కడ పని చేసిన ఏఎస్పీ వినీత్ చొరవతో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించినప్పటికీ పాఠశాలలకు సెలవు దినాలలో సర్వీసులు ఆపి వేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆటో వాలాలు అధిక చార్జీలు వసూలు చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాల దృశ్యా ప్రతి రోజు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.