Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
భారతదేశ భవిత యువత చేతుల్లోనే ఉందని, దేశ తలరాతలను మార్చగలిగే సత్తా వారి చేతిలోనే ఉందని యువతను చైతన్యపరిచిన మహౌన్నత వ్యక్తి వివేకానందుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం కూలీలైన్లోని వివేకానందుడి విగ్రహం వద్ద 159వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కూనంనేని వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరం శక్తి సామర్ధ్యాలపై ఆంచంచలమైన నమ్మకం ఉంచి వారిలో చైతన్యాన్ని నింపిన స్ఫూర్తిదాత, దార్శనికుడు, ఆదర్శనీయుడు వివేకానందుడని అన్నారు. నేటి పాలకులు అవలంబిస్తున్న యువజన వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోయిన విజరు కుమార్, 23వ వార్డు కౌన్సిలర్, సీపీఐ నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, వైఎఫ్ జిల్లా నాయకులు క్రాంతి, అజీజ్, ఎస్కె.ఖయ్యూం, భూపేష్, ఖదీర్, రూపేష్ పాల్గొన్నారు.